భారత్-పాక్ మ్యాచ్ చూసిన విద్యార్థుల అడ్మిషన్ రద్దు.. రూ. 5000 జరిమానా..!

NIT-Srinagar: ఇండియా-పాక్ టీ-20 మ్యాచ్ ని గ్రూపులుగా గనక వాచ్ చేస్తే ఊరుకోబోమని శ్రీనగర్లోని N.I.T యాజమాన్యం విద్యార్థులను హెచ్చరించింది.

Update: 2022-08-28 11:00 GMT

NIT-Srinagar: భారత్-పాక్ మ్యాచ్ చూసిన విద్యార్థుల అడ్మిషన్ రద్దు.. రూ. 5000 జరిమానా..!

NIT-Srinagar: ఇండియా-పాక్ టీ-20 మ్యాచ్ ని గ్రూపులుగా గనక వాచ్ చేస్తే ఊరుకోబోమని శ్రీనగర్లోని N.I.T యాజమాన్యం విద్యార్థులను హెచ్చరించింది. భారత్-పాక్ మధ్య మ్యాచ్ గనక.. భావోద్వేగాలు అదుపు చేసుకోలేని విద్యార్థులు ఉద్రిక్తతలకు దారితీసే పనులు చేస్తున్నారన్న ఉద్దేశంతో ఎన్.ఐ.టి అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో గానీ, మ్యాచ్ తరువాత గానీ హాస్టల్ గదుల నుంచి బయటకు రావద్దని ఆదేశించింది. ఒకవేళ తమ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా బయటికొచ్చి నినాదాలు చేసినా రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడినా వారి అడ్మిషన్ రద్దు చేస్తామని యాజమాన్యం హెచ్చరించింది. అంతేకాదు అలాంటి విద్యార్థులకు ఐదు వేల జరిమానా వేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News