Kapil Dev: సీనియర్లను పక్కనపెట్టి యువ ఆటగాళ్ళకు అవకాశం ఇవ్వండి
* టీ20ప్రపంచకప్ 2021లో టీమిండియా పేలవ ప్రదర్శనపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Kapil Dev: టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా పేలవ ప్రదర్శనపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాళ్ళను పక్కన పెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్నాడు. టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ వెంటనే జోక్యం చేసుకోని సీనియర్ ఆటగాళ్లపై ఒక నిర్ణయం తీసుకోవాలని కపిల్ దేవ్ సూచించాడు. జట్టు ఎంపిక, విరామం లేని షెడ్యూల్, బయో బబుల్ వాతావరణం ఆటగాళ్ల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసిందని ఇటీవల బుమ్రా చేసిన వ్యాఖ్యలపై కపిల్ దేవ్ భిన్నంగా స్పందించాడు.
తీరిక లేని షెడ్యూల్‌తో ఆటగాళ్లు ఇబ్బందిపడే వారిని పక్కనపెట్టి ఐపీఎల్ లో సత్తా చాటి మంచి ఫామ్ లో ఉన్న యువ ఆటగాళ్ళు రుత్ రాజ్ గైక్వాడ్, హర్శల్ పటేల్, వెంకటేష్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్ళకు అవకాశం ఇవ్వాలన్నాడు. అయితే తాజాగా కపిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యలను ఉద్దేశించే చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైన భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకొని యువ ఆటగాళ్ళను జట్టులోకి తీసుకొని భవిష్యత్తు తరాన్ని సిద్దం చేసే ఆలోచన చేయాలనీ కపిల్ దేవ్ సూచించాడు. టీ20 ప్రపంచకప్ లో గ్రూప్-2లో భాగంగా బుధవారం టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు దుబాయ్ వేదికగా షేక్ జాయద్ స్టేడియంలో సాయంత్రం 7.30 నిమిషాలకు తలపడనుంది.