IPL 2021 RR vs DC: మోరిస్ దంచేశాడు... 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం
IPL 2021 RR vs DC: ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తొలి విజయాన్ని సాధించింది.
IPL 2021 RR vs DC: ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తొలి విజయాన్ని సాధించింది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (18 బంతుల్లో 36 పరుగులు, 4సిక్సర్లతో) చెలరేగడంతో తొలి గెలుపును సాధించింది. ఉనాద్కట్ 11 పరుగులతో మోరిస్‌కు తోడుగా ఉన్నాడు. అయితే 148 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక దశలో ఓటమికి చేరువైంది. కానీ మోరీస్ మాత్రం ఓటమికి ఆ అవకాశం ఇవ్వలేదు.
ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ అద్భుత క్యాచ్ తో పెవిలియన్ చేరిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ.. ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కాగా, డేవిడ్ మిల్లర్( 43 బంతుల్లో 62, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తనదైన శైలిలో ఫాంలోకి వచ్చాడు. అయితే మిల్లర్ అవుటైన తర్వాత మరోసారి ఓటమికి చేరువైంది రాజస్థాన్ టీం. చివర్లో మోరిస్ మెరుపులతో లీగ్‌లో మొదటి విజయాన్ని అందించాడు. ఢిల్లీ బౌలర్లో ఆవేశ్ ఖాన్ 3, వోక్స్ 2, రబాడ 2 వికెట్లు తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో రిషబ్ పంత్ 51 పరుగులు చేయగా.. టామ్ కరన్ 21, లలిత్ యాదవ్ 20 పరుగులు సాధించారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో ఉనాద్కట్ 3, ముస్తాఫిజుర్ 2, మోరిస్ ఒక వికెట్ తీశాడు.