IPL 2020: కోహ్లీకి భారీ జరిమానా

IPL 2020: నిన్న జ‌రిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్​, రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌‌ళూర్ మ‌ధ్య జ‌రిగిన హోరాహోరీ పోరు జ‌రిగింది. ఈ మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.

Update: 2020-09-25 09:15 GMT

Virat Kohli fined Rs 12 lakh

IPL 2020: నిన్న జ‌రిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్​, రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌‌ళూర్ మ‌ధ్య జ‌రిగిన హోరాహోరీ పోరు జ‌రిగింది. ఈ మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఓట‌మిపై బెంగుళూర్ అభిమానులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ త‌రుణంలో బెంగుళూర్ అభిమానులకు మ‌రో షాకింగ్ విష‌యం తెలిసింది. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్ కారణంగా బెంగ‌ళూర్ కెప్టెన్‌కు భారీ జ‌రిమాన విధించారు . కోహ్లీకి 12 లక్షల జ‌రిమానాను విధించిన‌ట్టు లీగ్ అధికారులు తెలిపారు.

తొలి మ్యాచ్‌ లో ఎదురైన  పరాజయాన్ని పక్కనబెడుతూ.. కింగ్స్‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ ఐపీఎల్‌‌లో చెలరేగిపోయింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌ చేసిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు206 రన్స్‌ చేసింది. తర్వాత బెంగళూరు 17 ఓవర్లలో 109 రన్స్‌ కే కుప్పకూలింది . పంజాబ్​ విజయంలో సారథి కేఎల్​ రాహుల్​(132) కీలక పాత్ర పోషించాడు. శతకంతో మెరిసి.. ఇన్నింగ్స్​ను వన్​ మ్యాన్​ షోగా నిలిచారు.

గురువారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా బెంగళూర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించాడు. లీగ్ నిబంధనల ప్రకారం సారథికి 12 లక్షల జరిమానా విధించాం అని లీగ్ అధికారులు ప్రకటించారు.

ఐపీఎల్‌ 2020లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా విధించటం ఇదే తొలిసారి. కోడ్‌ ఆఫ్‌ కోడ్‌ కండక్ట్‌ ప్రకారం ఇదే పరిస్థితి మళ్లీ పునరావృతం అయితే, కెప్టెన్‌ కోహ్లి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News