IPL 2020: సదా నేను కృతజ్ఞుడిని: ధావన్ ఏమోషన్ ట్వీట్
IPL 2020: టీమిండియా డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. ఇండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఎన్నోసార్లు అద్భుత ఇన్నింగ్స్ తో ఎన్నో రికార్డులు సృష్టించాడు.
IPL 2020: టీమిండియా డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. ఇండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఎన్నోసార్లు అద్భుత ఇన్నింగ్స్ తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. భారత జట్టు జెర్సీ వేసుకొని పదేళ్లు అయిన సందర్భంగా గబ్బర్ స్పందించాడు. తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'టీమిండియాతో నా ప్రయాణం పదేళ్లు. నా దేశం కోసం ఆడుతున్నాను. గొప్ప గౌరవం . నా మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది. సదా నేను కృతజ్ఞుడిని' అని ధావన్ ఏమోషన్ అయ్యాడు.
2004 సంవత్సరంలో అండర్-19 ప్రపంచ కప్ లో 505 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు శిఖర్ ధావన్. ప్రపంచ కప్ టోర్నీ లోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. అయితే శిఖర్ ధావన్ ఎంతో అద్భుతమైన ప్రతిభ కనబరిచినప్పటికీ ఆ సమయంలో భారత జట్టులో ఎంతో నాణ్యమైన ప్రతిభగల అనుభవంగల ఆటగాళ్లు ఉండడంతో ఆ సమయంలో సెలెక్టర్లు ఎక్కువగా శిఖర్ ధావన్ పై ఆసక్తి చూపలేదు.
ఎట్టకేలకు 2010, అక్టోబర్ 20న వన్డే మ్యాచ్‌తో భారత జట్టు తరఫున అంతర్జాయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కానీ తొలి మ్యాచ్లోనే డకౌట్ అయిన శిఖర్ ధావన్... ఆ తర్వాత మాత్రం తనదైన దూకుడు ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి శిఖర్ ధావన్ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టీమిండియాలో డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.
ఇప్పటి వరకూ 136 వన్డేల్లో 5,688 పరుగులు చేసిన ధావన్.. 34 టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. 61 టీ20 మ్యాచ్‌లాడి 1,588 రన్స్ సాధించాడు. ఐసీసీ టోర్నీల్లో గబ్బర్‌కు మంచి రికార్డు ఉంది. ఈ మెగాటోర్నీల్లో 18 మ్యాచులాడిన ధావన్ 65.47 సగటుతో 1,113 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలు, 4 అర్ధశతకాలున్నాయి.