India vs England 3 T20: ఇండియా'పవర్'లెస్ ప్లే.. 12 ఓవర్లకు 71/4
India vs England 3 T20: ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ కు ఇండియా ప్లేయర్స్ దాసోహమంటూ పెవిలియన్ చేరుతున్నారు.
India vs England 3 T20: ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ కు ఇండియా ప్లేయర్స్ దాసోహమంటూ పెవిలియన్ చేరుతున్నారు. ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టినట్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ ఓడి.. బ్యాటింగ్‌కు దిగింది. 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ కు టాప్ ఆర్డర్ అంతా చేతులెత్తేంసింది.
రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ప్రారంభించారు. రాహుల్ యథావిధిగా డకౌవుట్ గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ (0; 4 బంతుల్లో) డకౌట్ అయ్యాడు. మార్క్‌వుడ్ వేసిన 2.3వ బంతిని ఆడబోయి అతడు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మూడు మ్యాచుల్లో అతడి స్కోర్లు 1, 0, 0. బ్యాటు, ప్యాడ్ల మధ్య నుంచి వేగంగా దూసుకొచ్చిన బంతి వికెట్లను తాకేసింది. టీమ్‌ఇండియాకు ఈ మ్యాచులోనూ శుభారంభం దక్కలేదు.
ఆతరువాత టీమ్‌ఇండియా రెండో వికెట్ చేజార్చుకుంది. మార్క్‌వుడ్ వేసిన 4.4వ బంతికి రోహిత్ (15; 17 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. 146 కి.మీ వేగంతో వచ్చిన షార్టపిచ్ బంతిని పుల్‌చేయబోయి లెగ్‌సైడ్లో ఆర్చర్ చేతికి చిక్కాడు. రోహిత్ జట్టులోకి వచ్చిన ఆనందం లేకుండా పోయింది. రెండో మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడనుకున్న ఇషాంత్ కూడా పెవిలియన్ చేరడంతో టీమిండియా వెనువెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. జోర్డాన్ వేసిన 5.2వ బంతికి ఇషాన్ కిషన్ (4; 9 బంతుల్లో) ఔటయ్యాడు. మంచి వేగం, బౌన్స్‌తో వచ్చిన బంతిని కిషన్ కీపర్ వెనక్కి ఆడాడు. బట్లర్ సులువుగా బంతిని అందుకున్నాడు. అప్పుడు టీమిండియా 6 ఓవర్లకు 24/3 గా ఉంది. అనంతరం కోహ్లీ బ్యాటింగ్ కి వచ్చాడు. బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై పడింది. దీంతో కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. పంత్ కోహ్లీకి తోడుగా ఉండి బ్యాటింగ్ చేస్తాడనుకుంటే... పంత్(25 పరుగులు, 20 బంతులు,3 ఫోర్లు) కూడా సామ్ కర్రన్ బౌలింగ్ లో రనౌట్ గా వెనుదిరిగాడు.