భారత్- న్యూజిలాండ్ మూడో వన్డేపై వర్షం ఎఫెక్ట్ .. సిరీస్ న్యూజిలాండ్‌దే..
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే కూడా వర్షార్పణమైంది.
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే కూడా వర్షార్పణమైంది. దీంతో కివీస్ 1-0 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. మొదటి వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించగా వర్షం కారణంగా రెండో వన్డే రద్దయింది. దీంతో మూడో వన్డే జరుగుతుందని క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ మూడో వన్డేపై కూడా వరుణుడు ప్రతాపం చూపించాడు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
మూడో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయస్ అయ్యర్ 49 పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 51 పరుగులతో రాణించాడు. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18 ఓవర్లలో 104 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫిన్ అలెన్ 57 పరుగులు చేయగా కాన్వే 38 పరుగులు చేశాడు.