IND VS BAN 3rd T20I: నేడు ఉప్పల్ టీ20..వర్షం పడుతుందా? క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి భారత్

IND VS BAN 3rd T20I: నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య టి20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. అటు జంట నగరాల్లో చాలా సుదీర్ఘకాలం తర్వాత ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ మ్యాచ్ చూసేందుకు హాజరుకానున్నారు.

Update: 2024-10-12 03:13 GMT

 ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7 గంటలకు స్పోర్ట్స్ 18 ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ఈ మ్యాచ్ ను ఓటిటి ద్వారా జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇప్పటికే టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో ఓడిపోయిన బంగ్లాదేశ్, అటు t20 సిరీస్ లో కూడా అదే పర్ఫామెన్స్ కొనసాగిస్తోంది. దీంతో ఈ సిరీస్ కూడా చేజార్చుకుంది. ప్రస్తుతం మిగిలిన ఏకైక మ్యాచ్లో పరువు నిలబెట్టుకునేందుకు బంగ్లాదేశ్ తాపత్రయపడుతోంది.

మరోవైపు సూర్య కుమార్ బృందం మాత్రం ఎలాగైనా సరే ఈ ఒక్క మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని పంతం పట్టుకుంది. అయితే ఈ మ్యాచ్లో పలువురు కొత్తవారికి అవకాశం లభించనుంది. ఐపీఎల్ లో అదరగొట్టిన కుర్రాళ్లకు అరంగేట్రం చేయించేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. అందుకే ఈసారి కొత్త ఆటగాడు హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. అలాగే మరో మరో బౌలర్ రవి బిష్ణోయ్ ను అరంగేట్రం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఐపీఎల్ మ్యాచులలో సన్రైజర్స్ టీం తరఫున విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శించిన అభిషేక్ శర్మ ఈసారి కూడా సొంత గ్రౌండ్లో చెలరేగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు అలాగే రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, పరాగ్, సూర్యకుమార్ తో కూడిన బ్యాటింగ్ లైనప్ చూస్తే బంగ్లా బౌలర్లకు దడ పుట్టించాల్సిందే. ఇక బంగ్లాదేశ్ మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది అని చెప్పవచ్చు. ఈ సిరీస్లో చాలా పేలవమైన ఫామ్ కనిపించింది. ఆటగాళ్లలో సమిష్టితత్వం లోపించింది. దీంతో వరుస పరాజయాలు తప్పడం లేదు.

గతంలో బంగ్లాదేశ్ ఇంత అవమానకరంగా ఎప్పుడూ ఓడిపోలేదు. పోరాటానికి మరో రూపంలో బంగ్లాదేశ్ ప్లేయర్లను చెప్పుకునేవారు. వారు సిరీస్లో కనీసం ఒకటి రెండు మ్యాచ్ స్ అయినా గెలిచేవారు. అలాంటిది బంగ్లా ప్లేయర్లు నేడు చేతులెత్తేయడం క్రీడాభిమానులను కలవరపరుస్తోంది. ఇక బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు మహమ్మదుల్లా ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ టి20 కెరీర్ నుంచి తప్పుకుంటున్నాడు. మరి బంగ్లాదేశ్ ప్లేయర్లు ఈ రోజైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారా... లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News