Holi Special: టీమిండియాకు కలిసొచ్చిన హోలీ.. మ్యాజిక్ చేసిన విరాట్ బ్యాట్
Holi Special: నేడు భారతదేశం అంతటా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. నీలిరంగు జెర్సీలో ఆడుతున్న టీమ్ ఇండియాకు ఈ పండుగ చాలా శుభప్రదంగా మారింది.

Holi Special: టీమిండియాకు కలిసొచ్చిన హోలీ.. మ్యాజిక్ చేసిన విరాట్ బ్యాట్
Holi Special: నేడు భారతదేశం అంతటా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. నీలిరంగు జెర్సీలో ఆడుతున్న టీమ్ ఇండియాకు ఈ పండుగ చాలా శుభప్రదంగా మారింది. ఈ రోజు భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. గత 15 సంవత్సరాలలో భారతదేశం హోలీ రోజున 2 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలుచుకుంది. భారత జట్టు రెండు సార్లు కూడా వెస్టిండీస్‌నే ఎదుర్కొన్న సందర్భాలు యాదృచ్చికం. ఈ కాలంలో విరాట్ కోహ్లీ బ్యాట్ కూడా బాగా రాణించింది. తను విజయంలో కీలక పాత్ర పోషించాడు. హోలీ నాడు ఆడిన మ్యాచ్‌లలో టీం ఇండియా ప్రదర్శన ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.
2011 ప్రపంచ కప్ సమయంలో మ్యాచ్
2011 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా మార్చి 20న హోలీ పండుగ వచ్చింది. ఈ రోజున భారత జట్టు వెస్టిండీస్‌తో గ్రూప్ దశ మ్యాచ్ ఆడింది. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని తరువాత సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్ ఇండియా తరపున ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. భారత జట్టు తొలి ఓవర్లోనే సచిన్ వికెట్ కోల్పోయింది. 9వ ఓవర్లో గంభీర్ కూడా 22 పరుగులు చేసి ఔటయ్యాడు.
దీని తర్వాత విరాట్ కోహ్లీ యువరాజ్ సింగ్‌తో కలిసి 122 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. అతను 76 బంతుల్లో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. యువరాజ్ 113 పరుగులతో భారత్ 268 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి ప్రతిస్పందనగా, వెస్టిండీస్ జట్టు కేవలం 188 పరుగులకు ఆలౌట్ అయింది. జహీర్ ఖాన్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, యువరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, హర్భజన్, సురేష్ రైనా చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ 80 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనకు గాను యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
2015లో కూడా
2015 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా టీం ఇండియా హోలీ రోజున రెండోసారి మ్యాచ్ ఆడింది. ఈసారి కూడా టీం ఇండియా వెస్టిండీస్‌తో తలపడింది. మార్చి 6న జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియాలోని WACA మైదానంలో మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ల బంతులకు వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ పరాజయం పాలయ్యారు. మొత్తం జట్టు కేవలం 182 పరుగులకే ఆలౌట్ అయింది. షమీ 3 వికెట్లు పడగొట్టగా, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా తలా 2 వికెట్లు పడగొట్టారు.
అశ్విన్, మోహిత్ శర్మ కూడా చెరో వికెట్ తీశారు. అయితే, ఈ చిన్న టార్గెట్ ను ఛేదించడం భారత్‌కు అంత సులభం కాదు. ఈ క్రమంలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ ట్రబుల్షూటర్ అయ్యాడు. అతను 36 బంతుల్లో 33 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతని ఇన్నింగ్స్ సరిపోలేదు. చివరికి, ధోని, అశ్విన్ కలిసి కేవలం 39.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. ధోని 45 పరుగులు నాటౌట్ గా, అశ్విన్ 16 పరుగులు నాటౌట్ గా నిలిచారు. తన అద్భుతమైన బౌలింగ్‌కు గాను షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.