కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్

భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఆంజియో ప్లాస్టీ చేసినట్టు తెలిసింది. కపిల్ దేవ్‌కు డయాబెటిస్, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Update: 2020-10-23 09:52 GMT

భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఆంజియో ప్లాస్టీ చేసినట్టు తెలిసింది. కపిల్ దేవ్‌కు డయాబెటిస్, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్ అనగానే క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. హర్యానా హరికేన్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ దిగ్గజ ఆల్ రౌండర్లలో ఒకరైన కపిల్ దేవ్ సారధ్యంలోనే ఇండియా వరల్డ్ కప్‌ను 1983లో గెలుచుకుంది. కపిల్ దేవ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. క్రికెట్‌కు సంబంధించి అప్ డేట్స్ మీద తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. ఐపీఎల్‌కు సంబంధించి కూడా అప్పుడప్పుతు తన అభిప్రాయాలు తెలుపుతారు. కపిల్ దేవ్ బయోపిక్ 83 పేరుతో రాబోతోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సి ఉంది.

Tags:    

Similar News