Sourav Ganguly Join BJP : బీజేపీలోకి బీసీసీఐ అధ్యక్షుడు?
Sourav Ganguly Join BJP : ఇండియన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. పశ్చిమబెంగాల్
Sourav Ganguly Join BJP : ఇండియన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అక్కడ ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే ప్రజాదరణ కలిగిన వ్యక్తులను పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీని పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు గంగూలీ కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా సమాచారం..
ఇక రెండు సంవత్సరాల క్రితం మమతా బెనర్జీ ప్రభుత్వం కోల్ కత్తా లోని సాల్ట్ లేక్ ప్రాంతంలో స్కూల్ నిర్మించడానికి రెండెకరాల స్థలాన్ని గంగూలీకి ఇచ్చింది. అయితే రెండు రోజుల కింద గంగూలీ ఆ స్థలాన్ని తిరిగి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఇచ్చేసారు. దీనితో గంగూలీ బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే గతంలో గంగూలీ రాజకీయాల్లో చేరుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే తనకి మాత్రం ఆసక్తి లేదని అయన వెల్లడించారు.
ఇక ఇండియన్ క్రికెట్ టీంకి సౌరవ్ గంగూలీ ఎన్నో సేవలని అందించారు.. భారత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన గంగూలీ ఎన్నో విజయాలను అందించాడు.. అలాగే యువరాజ్ , ధోని, జహీర్ ఖాన్, హర్బజన్ సింగ్ లాంటి ఎంతో మంది ఆటగాళ్ళను ప్రోత్సహించి వారికి జట్టులో స్థానం కలిపించారు గంగూలీ.. ఇక ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కీలకమైన పదవిలో ఉన్నారు.