ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
Asia Cup 2022 Schedule: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్-2022 షెడ్యూల్ విడుదలైంది.
Asia Cup 2022 Schedule: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్-2022 షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ సెక్రెటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు దుబాయ్, షార్జా మైదానాల్లో టోర్నీ జరగనుంది. ఈ సారి మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి.
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో పాటు ఓ క్వాలిఫయర్ టీమ్ కూడా పాల్గొంటోంది. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. రెండో రోజే గ్రూప్ ఏ విభాగంలో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఓటమిపాలైన టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది.