పెళ్లి మండపంలో ఆ డీజే పాటకు డాన్స్ చేసిన వరుడు, పెళ్లి కాన్సిల్ చేసిన వధువు తండ్రి

Update: 2025-02-02 16:00 GMT
పెళ్లి మండపంలో ఆ డీజే పాటకు డాన్స్ చేసిన వరుడు, పెళ్లి కాన్సిల్ చేసిన వధువు తండ్రి
  • whatsapp icon

Viral and Weird News: కొన్ని సంఘటనలు చిత్ర విచిత్రంగా జరిగిపోతుంటాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా నడుచుకోవాలో తెలియక కొంతమంది తమ జీవితంలో చాలా కోల్పోతుంటారు. ముఖ్యంగా మనిషికి హుందాతనం అనేది చాలా అవసరం. జీవితంలో ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అది తెలియకపోతే వచ్చే చిక్కులు అన్నీ ఇన్ని కావు. కొన్నిసార్లు సరిదిద్దుకోలేని విధంగా పెద్ద పెద్ద డ్యామేజ్‌లే జరిగిపోతుంటాయి. ఆ తర్వాత హుందాగా ఉండాలని తెలుసుకున్నా... అప్పుడు పరిస్థితి చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఉంటుందే తప్ప ఇంకేం ఉండదు.

ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు అనుకుంటున్నారా? యస్... అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక వరుడి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇంకో గంటలో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడుకి డీసెన్సీ మెయింటేన్ చేయడం తెలియక జుట్టు పీక్కుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఎన్టీడీవీ వార్తా కథనం ప్రకారం ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లికి రెడీ అయిన ఒక వరుడు ఊరేగింపుగా పెళ్లి మండపానికి వచ్చారు. డీజే పాటలతో పెళ్లి మండపం ఫుల్ సందడిగా ఉంది. వరుడి స్నేహితులు డీజే పాటలకు స్టెప్పులేస్తూ పెళ్లి వేడుక ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే ఊరేగింపుగా అక్కడికి వచ్చిన పెళ్లి కొడుకును కూడా డ్యాన్స్ చేయాల్సిందిగా బలవంతం చేశారు.

అదే సమయంలో బ్యాగ్రౌండ్‌లో "చోలీ కే పీచే క్యా హై..." అనే బాలీవుడ్ ఐటం సాంగ్ ప్లే అవడం మొదలైంది. అప్పటివరకు తమాయించుకున్న పెళ్లి కొడుకుకు కూడా ఓవైపు స్నేహితుల బలవంతం, మరోవైపు చోలీ కే పీచే క్యా హై సాంగ్ మాంచి ఊపునిచ్చింది. ఇంకేం ఆ పాట వింటూ తనివితీరా స్టెప్పులేశారు.

వరుడి డ్యాన్స్ చూసి పెళ్లి మండపంలో ఉన్న వాళ్లందరికీ ఇంకా ఊపొచ్చింది. అంతా చుట్టూ చేరి ఎంకరేజ్ చేశారు. కానీ ఆ ఐటం సాంగ్‌కు తనకు కాబోయే అల్లుడు ఒళ్లు మరిచి స్టెప్పులేయడం పిల్లనిచ్చే మామకు నచ్చలేదు. కాబోయే అల్లుడి వైఖరి ఆయనకు అంత హుందాగా అనిపించలేదు. వెంటనే పెళ్లి రద్దు చేసుకుంటున్నామని చెప్పి తన బిడ్డను, కుటుంబాన్ని తీసుకుని పెళ్లి మండపం నుండి వెళ్లిపోయారు.

వరుడు ఇలా ఐటం సాంగ్స్ కు డ్యాన్సులేయడాన్ని ఆయన అవమానంగా భావించారు. అందుకే ఎవరెన్ని విధాలుగా నచ్చచెప్పినా ఆయన కోపం తగ్గలేదు. చివరికి వరుడే వచ్చి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వధువు తండ్రి వెనక్కి తగ్గలేదు. వరుడు నచ్చచెప్పే తీరు చూసి వధువే కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ ఆమె తండ్రి అసలు తగ్గేదేలేదన్నారు.

ఇలా చోలీ కే పీచే క్యా హై పాటకు వరుడు డ్యాన్స్ చేయడంతో పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్త చివరకు పేపర్లలో, సోషల్ మీడియాలోకి కూడా ఎక్కింది. దీంతో ఈ డ్యామేజ్ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో ఓ ఫన్నీ న్యూస్ అయిపోయింది. నెటిజెన్స్ ఎవరికి నచ్చినరీతిలో వారు కామెంట్స్ పెడుతూ ఈ వార్తను మరింత వైరల్ చేస్తున్నారు. ఇదంతా చూస్తోంటే పాపం ప్రస్తుతం ఆ వరుడి పరిస్థితి ఎలా ఉందో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలా నడుచుకోవాలో తెలియకే జరిగిపోయిన డ్యామేజ్ కదా మరి!! 

Tags:    

Similar News