Viral Video: వావ్.. ఇస్త్రీ ఇలా కూడా చేస్తారా బ్రో.. టెక్నిక్ మాములుగా లేదుగా వీడియో చూడండి..!

Man Ironing Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి కాస్త ఏమాత్రం ఆసక్తిగా ఉన్నా అవి నెట్టింటా షేర్ చేస్తారు. అవి కాస్తా వైరల్‌గా మారుతాయి. వాటికి కామెంట్స్ కూడా పెడుతుంటారు.

Update: 2025-03-17 06:10 GMT
Man Uses Iron Bar to Iron Jeans Viral Video Shocks the Internet

Viral Video: వావ్.. ఇస్త్రీ ఇలా కూడా చేస్తారా బ్రో.. టెక్నిక్ మాములుగా లేదుగా వీడియో చూడండి..!

  • whatsapp icon

Man Ironing Viral Video: కొందరికి అతి తెలివితో చేసే పనులు ఇతరులను ఆకర్షిస్తాయి కొంతమందికి ఫన్నీగా కనిపిస్తాయి. అయితే తెలివి లేని తనంతో చేసే కొన్ని పనులు కూడా మనకు నవ్వుల పువ్వులు పూయిస్తాయి. అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఇస్త్రీ పెట్టలేకపోవడంతో ఏకంగా ఇనుప పారాతో ఇస్త్రీ చేశాడు. అతని టెక్నిక్ కి అందరూ ఫిదా అయిపోయారు. 'ఇస్త్రీ ఇలా కూడా చేస్తారా బ్రో' అంటూ నెట్టింటా నవ్వుల పూవులు పూయిస్తున్నారు. నిజానికి అతని టాలెంట్ కి మెచ్చుకోవాల్సిందే. ఇస్త్రీ చేయడానికి పెట్ట లేకున్నా ఒక ఇనుప పార తీసుకొని అందులో నిప్పులు వేసి తన జీన్స్‌ ప్యాంట్‌ను ఎంచక్కా ఇస్త్రీ చేసుకున్నాడు. అతని టెక్నిక్ కి చాలామంది ఫిదా అవుతున్నారు. మరికొంతమంది ఫన్నీగా ఫీల్ అవుతున్నారు.

ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 'ఇస్త్రీ ఇలా కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది బ్రో' అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు పారతో ఇస్త్రీ చేయడం అవ్వకయ్యేలా చేస్తుంది అంటూ రకరకాల ఈ ఎమోజీలు సైతం పెడుతూ స్పందిస్తున్నారు. అయితే ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ కూడా వచ్చాయి.

ఈ వీడియోలో వ్యక్తి తలకు హ్యాట్‌ పెట్టుకున్నాడు. తన జీన్స్ ఇస్త్రీ లేదనుకుంటా.. ఏకంగా పార ఉంది కదా ఇంకేంటి అని ఇనుప పార తీసుకొని అందులో నిప్పులు వేశాడు. అది మండుతూ ఉంది కూడా. దీంతో ఎంచక్కా తన జీన్స్ ను అటు ఇటు తిప్పుతూ ఇస్త్రీ చేసేసుకున్నాడు.

నీ తెలివికి హ్యాట్సాఫ్, మైండ్ బ్లోయింగ్ బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే నిజానికి ఒక నిప్పు జీన్స్ పైన పడ్డ కానీ అది కాలిపోవడం జరుగుతుంది. ఇతను జాగ్రత్తగా ఇస్త్రీ పెట్ట లేకున్నా ఇనుప పారతో హాయిగా ఇస్త్రీ చేసి మడత కూడా పెట్టేశాడు.

సోషల్ మీడియాలో ఇలాంటి ఫన్నీ వీడియోలు ఆసక్తిగా అనిపిస్తాయి. ఏమాత్రం మనం చేసే పనులకు కాస్త భిన్నంగా ఉన్నా వాటిని వెంటనే నెట్టింటా షేర్ చేస్తారు. అది త్వరగా వైరల్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఈ వ్యక్తి చేసిన వీడియో కూడా నెట్టింటా ఫన్నీగా అనిపిస్తుంది. కొంతమంది టాలెంట్ అని అంటున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Tags:    

Similar News