LPG Cylinder Price: సామాన్యులకు షాక్ ఇచ్చిన కేంద్రం... రూ. 50 పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర

LPG Price In Pakistan: పాకిస్థాన్‌లో గుది బండ.. ఇదేం సిలిండర్ ధరరా నాయన.. ఇంత ఖరీదు అయితే ఎలా బ్రో!
LPG Cylinder Price hike: కేంద్రం అందరికీ షాకింగ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒక్కో సిలిండర్ పై రూ. 50 పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి తెలిపారు. సాధారణ కేటగిరి వినియోగదారులతో పాటు ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని కేంద్రమంత్రి పురి స్పష్టంచేశారు.
ఈ ధరల పెంపు అనంతరం ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు లభించే సిలిండర్ ధర రూ. 500 నుండి 550 కానుందని, సాధారణ కేటగిరి వారికి రూ. 803 నుండి రూ. 853 కానుందని కేంద్రమంత్రి పురి అన్నారు.