'అదిరింది' యాంకర్ సమీర ఎవరు?
ఈటీవీలో వచ్చే జబర్ధస్త్ కామెడీ షోకు బై బై చెప్పేసి ఇప్పుడు జీ తెలుగులో వచ్చే 'అదిరింది' ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా
ఈటీవీలో వచ్చే జబర్ధస్త్ కామెడీ షోకు బై బై చెప్పేసి ఇప్పుడు జీ తెలుగులో వచ్చే 'అదిరింది' ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు నాగబాబు. తాజాగా ఆదివారం ఫస్ట్ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోలో నాగబాబుతో పాటు అయన ముద్దుల కూతురు నిహారిక మరో జడ్జ్‌గా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఈ షోకి సమీరా యాంకర్ గా వ్యవహరిస్తుంది.
అయితే సుమ, శ్రీముఖి, అనసూయ, రష్మీ లకి పోటిగా ఇప్పుడు సమీర ఎంటరైంది. ఇంతకి ఈ సమీర ఎవరు? ఆమె నేపధ్యం ఏంటి అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తెలుగులో పలు సీరియల్లో నటించింది సమీర.. ఆడపిల్ల, అభిషేకం, భార్యామణి, ప్రతిబింబం, మంగమ్మ గారి మనవరాలు ఆమెకి నటిగా మంచి పేరును తీసుకువచ్చాయి. తెలుగుతో పాటు పలు తమిళ్ సీరియళ్లలో కూడా సమీర నటించింది.
ఆ తర్వాత సీరియల్స్ కి బ్రేక్ చెప్పిన సమీర ఇప్పుడు మళ్ళీ ఈ షోతో యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ షోకి యాంకర్ గా కొత్త కెరియర్ ని మొదలు పెట్టిన సమీరాని ప్రేక్షకులు అనసూయ, రష్మీలతో పోల్చి చూడటం కామన్. .గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవనే సంగతి అవుతుంది. ఇక భవిష్యత్తులో సమీరా అనసూయ,రష్మీలా లాగే తనకంటూ ఓన్ ఐడెంటిటీని ఏర్పరుచుకోవడంపైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది.