Nayanatara: కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు..రెట్టింపు వడ్డీతో తిరిగి వస్తోంది..సంచలనంగా మారిన నయనతార వ్యాఖ్యలు
Nayanatara: ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టు ధనుష్ వర్సెస్ నయన్ వివాదం మళ్ల రాజుకుంటున్నట్లు తెలుస్తోంది. నయన్ తాజాగా ఆమె కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి ఒకరి జీవితాన్ని అబద్దాలతో నాశనం చేయాలని భావిస్తే..దానిని అప్పుగా భావించండి అంటూ పోస్టు చేశారు.
నయనతార..పాత్ర ఏదైనా సరే తన యాక్టింగ్ ప్రేక్షకుల మనస్సులో గూడుకట్టుకుంటారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీలలోనూ నయనతారకు మంచి గుర్తింపు ఉంది. ఆమె సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆధరిస్తున్నారంటే ఇదే నిదర్శనం. అయితే తాజాగా నయనతార ఇన్ స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఓ పోస్టు తెగ వైరల్ అవుతోంది. నయనతార కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి మీరు ఒకరి జీవితాన్ని అబద్ధాలతో నాశనం చేయాలని భావిస్తే దానిని అప్పుగా భావించండి..ఎందుకంటే అది రెట్టింపు వడ్డీతో తిరిగి వస్తుందని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
ఈమధ్యే నయనతార జీవితాన్ని నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీగా రూపొందిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడిదాన్ సన్నివేశాలకు నిర్మాత ధనుష్ పర్మిషన్ లేకుండా ఉపయోగించినందుకుగానూ ఇటీవల ఆయన నయనతార దంపతులుపై కోర్టులో దావా వేశారు. 3 సెకండ్ల నిడివి క్లిప్ కు ఏకంగా రూ. 10కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు పంపించాడు. ఈ నేపథ్యంలోనే నయనతార ఇలా స్పందించినట్లు సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది.
ధనుష్ కోర్టులో కేసు వేయడంపై నయన్ మళ్లీ ఫైర్ అయినట్లు సమాచారం. ధనుష్, ఐశ్వర్య దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరి పెళ్లి 2004లో జరిగింది. 2022లో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో దీన్ని నయన తార పరోక్షంగా ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నా..ఇబ్బందుల్లోకి నెట్టాలని అనుకున్నా..కర్మ అస్సలు వదిలి పెట్టదని..వడ్డీతో సహా ఇచ్చేస్తుందంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్టు ధనుష్ ను ఉద్దేశించి పెట్టారంటూ చర్చ సాగుతోంది.