Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD ట్విట్టర్ టాక్ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..
Kalki 2898 AD Telugu Movie Twitter Review: ఎట్టకేలకు కల్కి సినిమా థియేటర్లకు వచ్చేసింది. భారత్‌లో ఇంకా విడుదలకాకపోయిన్పటికీ ఓవర్‌సీస్‌లో ఈ సినిమా మొదటి షో పడిపోయింది.
Kalki 2898 AD Movie Twitter Review: ఎట్టకేలకు కల్కి సినిమా థియేటర్లకు వచ్చేసింది. భారత్‌లో ఇంకా విడుదలకాకపోయిన్పటికీ ఓవర్‌సీస్‌లో ఈ సినిమా మొదటి షో పడిపోయింది. దాదాపు 4 ఏళ్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మరికొన్ని గంటల్లో భారత్‌లో ఈ సినిమా విడుదలవుతుండగా ఇప్పటికే అమెరికాలో ప్రేక్షకులు కల్కి ఫస్ట్ షోను చూసేశారు.
దీంతో ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తున్నారు. మొదటి నుంచి పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతున్న కల్కి మూవీకి ట్విట్టర్‌లో కూడా పాజిటివ్ బజ్ రావడం విశేషం. సినిమా చూసిన వారంతా కల్కిపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. సినిమా ఓ రేంజ్‌లో ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. నాగ అశ్విన్ ఓ అద్భుత ప్రపంచాన్ని చూపించారని, సరికొత్త లోకంలోకి తీసుకకెళ్లారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరికొందరు ట్వీట్ చేస్తూ.. పురాణాలను, ఆధునిక ప్రపంచాన్ని కంబైడ్ చేసి నాగఅశ్విన్ కథను మలిచిన తీరు అద్భుతమని ప్రశంసిస్తున్నారు. సినిమాలో వీఎఫెక్స్ మంత్రముగ్ధుల్ని చేస్తుందని, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయని ట్వీట్స్ చేస్తున్నారు. భవిష్యత్తును ఊహించి నాగ అశ్విన్ కథను మలిచిన తీరు చాలా బాగుందంటూ మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. మొత్తం మీద కల్కి మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది.
మరి దాదాపు రూ. 600 కోట్లతో తెరకెక్కిన కల్కి సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక నాగఅశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమాపై మొదటి నుంచి ఆకాశన్నంటే అంచనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమితాబ్, కమల్‌హాస్, దీపికాతో పాటు మరెంతో మంది స్టార్ నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను తిరగరాయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.