Pawan Kalyan: తొలి పోస్ట్‌తో ఫ్యాన్స్‌కి కిక్కిచ్చిన పవర్ స్టార్.. ఇన్‌స్టాలో జనసేనాని సరికొత్త రికార్డులు..!
Pawan Kalyan First Instagram Post: పవర్ స్టార్ నుంచి జనసేనానిగా మారిన పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో అగ్రగామిగా మారిన ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టాడు.
Pawan Kalyan First Instagram Post: పవర్ స్టార్ నుంచి జనసేనానిగా మారిన పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో అగ్రగామిగా మారిన ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టాడు. ఈ మేరకు మొదటి పోస్ట్ చేశారు. జులై నెల 4వ తేదిన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేసిన పవన్.. ఎలాంటి పోస్ట్ చేయలేదు. అయితే, విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కొన్ని గంటల్లోనే ఫాలో అయ్యారు. ప్రస్తుతం జనసేనానిని ఇన్‌స్టాలో ఫాలో చేస్తున్న వారి సంఖ్య 2.4 మిలియన్లు దాటింది. ఈ క్రమంలో నేడు ఆయన ఇన్‌స్టాలో మొదటి పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇలా హీరోలు, కమెడీయన్లు, నిర్మాతలు, హీరోయిన్లు ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ వీడియోలో తన మాజీ భార్య రేణు దేశాయ్ ఫోటో కూడా ఆయన షేర్ చేశాడు. వీరితోపాటు అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కరుణాకరణ్, పూరి జగన్నాథ్‌తోపాటు పలువురు డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, తమిళ హీరోలు కూడా ఉన్నారు. వీరందరితో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోలను ఈ వీడియోలో చూపించారు.
తమ అభిమాన నటుడు ఇన్‌స్టాలో తొలి పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. పోస్ట్ చేసిన గంటలోనే 4,16,538 లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. అయితే, ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.