Kalki 2898 AD Movie OTT: కల్కి ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..

Kalki 2898 AD Telugu Movie OTT Release Date: కల్కి సినిమా హక్కులను దక్షిణాది భాషలకు గాను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, హిందీ భాషకు సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Update: 2024-06-26 14:47 GMT

Kalki 2898 AD Movie OTT: కల్కి ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..

Kalki 2898 AD Movie OTT: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి కల్కి సినిమా పైనే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాల నడుమ జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఆకాశాన్ని అంటేలా అంచనాలు ఉన్నాయి. అమితాబచ్చన్, కమలహాసన్ వంటి దిగ్గజ హీరోలు నటిస్తున్న ఈ సినిమా క్రేజ్ ఖండాంతరాలు దాటింది. అమెరికాలో ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా కల్కి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా కల్కి రికార్డులు సృష్టించింది.

ఇలా విడుదలకు ముందే సరికొత్త రికార్డులు తిరగ రాస్తున్న కల్కి సినిమాకు సంబంధించి ఓ తాజా వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అదే కల్కి సినిమా ఓటీటీ స్క్రీమింగ్. ప్రస్తుతం సినిమా విడుదలైన నెలరోజుల్లోపే ఓటీటీలో సినిమాలు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే కల్కి మేకర్స్ మాత్రం ఈ సినిమాను ఓటీటీలో కచ్చితంగా 8 వారాల తర్వాతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై చిత్ర యూనిట్ ఇప్పటికే ఓటీటీ సంస్థలతో ఒక ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.

సినిమా ఫలితం ఎలా ఉన్నా, కచ్చితంగా 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలని ముందస్తుగా నిర్ణయించారని టాక్. ఇదిలా ఉంటే కల్కి సినిమా హక్కులను దక్షిణాది భాషలకు గాను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, హిందీ భాషకు సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా విజయంపై చిత్ర యూనిట్ కు ఉన్న ధీమాతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని చర్చ సాగుతోంది. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలవుతున్న కల్కి సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News