Gopichand: నా పిల్లల్ని ఇప్పటికీ బస్సులోనే స్కూల్ కి పంపుతాను..
Gopichand: నా పిల్లల్ని ఇప్పటికీ బస్సులోనే పంపుతాను స్కూల్ కి..
Gopi Chand: ప్రముఖ డైరెక్టర్ టీ కృష్ణ తనయుడి గా గోపీచంద్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2021లో "తొలివలపు" అనే సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చిన గోపీచంద్ జయం, నిజం, వర్షం వంటి సినిమాలలో విలన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోగా కూడా లక్ష్యం, గోలీమార్, సాహసం వంటి మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు.
ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "రాము బాణం" పైన పెట్టుకున్నారు గోపీచంద్. డింపుల్ హాయాతి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కుష్బూ, జగపతిబాబు, నాజర్, వెన్నెల కిషోర్, సచిన్, అలీ, ఖేడేకర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 5 న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న గోపీచంద్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నారు.
2013 లో రేష్మ తో వివాహం చేసుకున్న గోపీచంద్ ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యారు. అయితే తాజాగా తన పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ తన పిల్లలు ఇప్పటికీ బస్సులోనే స్కూల్ కి వెళ్తారని చెప్పుకొచ్చారు. "నా పిల్లలని ఇప్పటికీ బస్సులోనే స్కూల్ కి పంపుతాను. కారులో పంపను. అలాగే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఎంత పడితే అంత ఇచ్చేయను. ఎందుకంటే వాళ్లకి కూడా రియాలిటీ అర్థం కావాలి. వాళ్ళు కూడా అందరితో కలవడం నేర్చుకోవాలి," అని అన్నారు గోపీచంద్.