కొన్ని సినిమాలు చిరకాలం అలా నిలిచిపోతాయి, అలాంటి ఒక సినిమానే పాండవ వనవాసం. ఈ సినిమా 1965లో నిర్మించబడిన పౌరాణిక తెలుగు సినిమా. ఈ చిత్రరాజాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు, "పౌరాణిక బ్రహ్మ"గా ప్రసిద్ధిచెందిన కమలాకర కామేశ్వరరావు దర్శకులుగా తెరకెక్కించారు. మహాభారతం లోని పాండవులు మాయాజూదంలో ఓడి వనవాస కాలంలో జరిగిన విశేషాల్ని సముద్రాల రాఘవాచార్య రచించారు. ఈ సినిమాలో ఆ తరువాత ప్రఖాత్య హిందీ సినిమా తార అయిన హేమామాలిని కొన్ని నృత్య సన్నివేశాలలో నటించింది. ఇదే ఆమె తొలి సినిమా. శ్రీ.కో