కొన్ని ప్రేమ పాటలు ఎప్పటికి నిలిచిపోతాయి, అలాగే విరహగీతాలు కూడా..అలాంటి ఒక పాటనే అభినందన సినిమాలోని ఈ.... ఎదుట నీవే ఎదలోన నీవే అనే పాట.
ఎదుట నీవే ఎదలోన నీవే
ఎదుట నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణీ కానీదు
కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా.
ఇప్పటివరకు మీరు ఈ పాట వినకుంటే ఒక్క సారి వినండి, ప్రేమలోతుని పట్టిన పాట అని అంటారు.శ్రీ.కో.