ఆచార్య ఆత్రేయుని అద్భుతమైన భావ సంపదకి బాల మురళి గాన సంపద!
ఆచార్య ఆత్రేయుని అద్భుతమైన భావ సంపదకి బాల మురళి గాన సంపద తోడైతే వచ్చిన పాట...
మౌనమే నీ భాష ఒ మూగ మనసా !
తలపులు ఎన్నెన్నోకలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నేరౌతావు
చీకటి గుహ నీవు
చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో
ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో
ఏమై మిగిలేవో ...
కోర్కెల సెల నీవు
కూరిమి వల నీవు
ఉహాల ఉయ్యాలవే మనసా
మాయల దయ్యనివే
లేనిది కోరేవు
ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు వగచేవు....
మీరు ఇప్పటివరకు ఈ పాట వినకుంటే ఒక్క సారి వినండి. శ్రీ.కో