ఆయనకు సినిమా - సంగీతం ఒక తపస్సు

Update: 2019-02-09 12:14 GMT

కొద్దిమంది దర్శకులకి సినిమా ఒక కళ మాత్రమే కాదు, ఒక తపస్సు లాంటిది, అలాంటి వారే...కళాతపస్వి గా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కేపురస్కారాన్ని అందుకున్నాడు. విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసాడు. ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.శ్రీ.కో.

Similar News