సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడటం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది....మన జయప్రకాశ్ రెడ్డి గారు. వీరు ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు కూడా. వీరు రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. ఈయన ఎక్కువగా ప్రతినాయక మరియు హాస్య పాత్రలను పోషిస్తుంటాడు. ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి ప్రముఖ నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అలా ఈయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు.[2] కానీ 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు. విలన్ పాత్రలే కాకుండా...హాస్య పాత్రలు అద్భుతంగా పోషిస్తున్నారు. శ్రీ.కో.