''యాత్ర'' సినిమాలో ఆ పాత్ర ఎవరికి?

Update: 2018-10-01 09:59 GMT

పెద్ద పెద్ద నాయకుల జీవిత కథల ఆధారంగా ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి, అలాగే తెలుగులో ఇప్పుడు ఎన్టీఆర్ గారి జీవిత కథతో వస్తున్డగానే.. మరో మహానేత….దివంగత నేత, వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ''యాత్ర'' సినిమా కూడా వస్తుంది.. ఈ సినిమా షూటింగ్ చాల వరకు ఇప్పటికే పూర్తి అయ్యింది అని అంటున్నారు.. అయితే ఈ చిత్రంలో వైఎస్సార్ తనయుడు, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఒక మిలియన్ డాలోర్ ప్రశ్నలా అందరిలో ఆసక్తిని పెంచుతుంది...  ఈ సినిమా దర్శకుడు మహి.వి రాఘవ్ . ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న విషయం ఇప్పటికే అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాత్ర కోసం సూర్య లేదా కార్తీ ఎంపికయ్యే అవకాశం వుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.. అయితే ఇప్పుడు కొద్దిమంది... ఆ పాత్ర విజయ్ దేవరకొండ చేస్తే బాగుంటుందని.. ప్రయత్నాలు మొదలెట్టారట. చివరికి ఎవరు ఆ పాత్ర సంపాదిస్తారో చూడాలి... శ్రీ.కో.
 

Similar News