దసరా లేదా విజయదశమి అని మనము జరుపుకునే ఈ పండగ, రెండు వేడుకలకు సూచికగా జరుపుకుంటామని మీకు తెలుసా! ఒకటి రావణుడి పై రాముడు విజయం మరియు అసురుడు అయిన మహిషసురిడి పై దుర్గా దేవి విజయం, ఈ రెండింటిని మనం ఈ దసరా రోజున జరుపుకుంటాము.
దశ -హారా : దసరా అనే పదము ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా ! 'దసరా' సంస్కృత పదం 'దశ-హరా' నుండి వచ్చింది, దీని అర్ధం "దశకంటుడుని( రావణుడిని) రాముడు చంపనంతవరకు సూర్యుడు ఉదయించడు" అని అర్ధం అట.