చనిపోయిన భర్త చిత్రంతో.. ప్రపంచ టూర్..

Update: 2019-05-26 11:50 GMT

భర్త తో ఆనందకరంగా జీవిస్తున్నపుడు ఎన్నో మధుర స్మృతులు ఉంటాయి. దాంపత్య జీవితంలో ఇద్దరూ కల్సి ఎన్నో మధురానుభూతులను పోగేసుకుంటారు. దురదృష్టవశాత్తు ఎంతగానో ప్రేమించిన భర్త అకస్మాత్తుగా మరణిస్తే ఆ వేదన వర్ణనాతీతం. సరిగ్గా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్లీ బౌర్క్ కు ఇదే పరిస్థితి ఎదురైంది.

పాల్ ఓ హెవీ ట్రక్ డ్రైవర్. భార్య మిచెల్లీ బౌర్క్ తో ఆస్ట్రేలియా లో ఉండేవాడు. చర్మ క్యాన్సర్ తో కొన్నాళ్ల క్రితం మరణించాడు. తన అవసాన దశలో ఆటను తన భార్యను ఓ ప్రశ్న అడిగాడు. నేను చనిపోయిన తరువాత ఎం చేస్తావు అని. దానికామె మీ ఫోటో పక్కనుంచుకుని ప్రపంచం చుట్టేస్తాను. మీ ఫోటో పక్కన ఉంటె మీరున్నట్టీ అని జవాబిచ్చింది. కొన్నాళ్లకు పాల్ కన్నుమూసాడు. తన భర్త కు ఇచ్చిన మాటను బౌర్క్ మర్చిపోలేదు. తన భర్త నిలువెత్తు కటౌట్ తయారు చేయించి దాన్ని తనపక్కనే పెట్టుకుని ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించింది. ఆఫ్రికన్ గ్రాండ్ కాన్యాన్, ఈఫిల్ టవర్, బకింగ్ హామ్ ప్యాలస్, ఫుకెట్, న్యూయార్క్ వంటి ప్రాంతాలను చుట్టేసింది.

పాతికేళ్ల తమ దాంపత్య జీవితంలో ఎన్నో ప్రదేశాలకు వెళ్లాలనుకునేవాళ్లమని, ఇప్పుడిలా అతడి బొమ్మతో విహారయాత్రలు చేయాల్సి వస్తోందని మిచెల్లీ వివరించింది. ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసే మిచెల్లీ మంచి రచయిత కూడా. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అంతే కాదు, పాల్ మొదటి భార్యను, ఆమె ఇద్దరు కుమారులను కూడా మిచెల్లీనే సంరక్షిస్తోంది. 

Similar News