Prabuthwa Junior Kalashala: 'డూడుం డుక్కుడుం' సాంగ్ విడుదల చేసిన జీవీ ప్రకాష్ కుమార్
GV Prakash: మంగ్లీ మార్కుతో చార్ట్ బస్టర్ గా దూసుకుపోతున్న డూడుం డుక్కుడుం
Prabuthwa Junior Kalashala: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కాలేజ్ ఫేస్ పూర్తిచేసుకుని వచ్చిన వారే ఉంటారు. కాలేజీలో ప్రేమలు ఎలా ఉంటాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కాలేజ్ లవ్ స్టోరీ గా వచ్చి ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి ఈ నేపథ్యంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హపెనింగ్ సింగర్ మంగ్లీ పాడిన డూడుం డుక్కుడుం సాంగ్ ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా సాంగ్ మొత్తం విన్న జీవి ప్రకాష్ కుమార్ అత్యద్భుతంగా ఉందని మేకర్స్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. సాంగ్ మ్యూజికల్ గా చాలా బాగుందని క్లాసికల్ టచ్ ఇవ్వడం తనకు పర్సనల్గా బాగా నచ్చిందని జీవి ప్రకాష్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ సాంగ్ బాగా నచ్చడంతో మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని తాను బలంగా చెప్పగలనని జీవి ప్రకాష్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్తీక్ రోడ్రిగ్జ్ అందించిన బాణీలకు శ్రీ సాయి కిరణ్ అర్థవంతమైన లిరిక్స్ రాయగా వాటిని తనదైన శైలిలో శ్రోతలందరూ మళ్లీ మళ్లీ వినే విధంగా ఆలపించారు మంగ్లీ. ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకోగా సాంగ్ అదే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. కాలేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో కాలేజీ జంట మధ్య డూడుం డుక్కుడుం అంటూ సాగుతున్న ఈ సాంగ్ అత్యంత ఆసక్తికరంగా ఉంది.
టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కొవ్వూరి అరుణ సమర్పకురాలు కాగా భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.