‘సామి' సంగతి

Update: 2018-09-27 12:02 GMT

‘సామి' మూవీ లో విక్రమ్ పెర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే  బాబీ సింహా విలనిజం కూడా తోడైది, అయితే  రోటీన్ రివేంజ్ డ్రామా, వయొలెన్స్ కాస్త ఎక్కువగా ఉండటం, కథలో కొత్తదనం లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో నిలబడక పోవచ్చు. ముక్యంగా ‘సామి' మూవీ మనం చాల సార్లు చుసిన రోటీన్ రివేంజ్ పోలీస్ డ్రామా. కథలో కొత్తదనం లేక పోయినా యాక్షన్, కామెడీ పర్వాలేదనిపిస్తుంది. ‘సింగం' సిరీస్ తరహాలో మరో పోలీస్ డ్రామా చూడాలనుకుంటే వెళ్లొచ్చు. దర్శకుడు ఇంతకు ముందు సింగం, సింగం 2, సింగం 3 సినిమాలను తీసిన హరి.  ‘స్వామి' సినిమాలో కాస్త కాన్సెప్టును, హీరో హీరోయిన్లను, ఇతర నటీనటులను మార్చినట్లు ఉందే తప్ప కొత్తదనం చూపించలేదు. పోలీస్ డ్రామాలు కూడా కొత్తతరహాలో ఉంటేనే తప్ప ప్రేక్షకులు మెప్పుపొందడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇంకా పాతకాలం చింతకాయ పచ్చడినే కొత్త సీసాలో అమ్మేట్టు కృషి జరగింది అని చెప్పవచ్చు. శ్రీ.కో.
 

Similar News