“విధాత తలపున ప్రభవించినది” అనే ఈ పాట!

Update: 2018-11-12 09:54 GMT

కొన్ని పాటలు.. ఎన్ని సార్లు విన్న... అలా వినాలనిపిస్తాయి... అలాగే.. ఆ రాసిన రచయితని.. ఎంతో పేరుని తీసుకువస్తాయి... అలాంటి పాటే ఈ “విధాత తలపున ప్రభవించినది” అనే ఈ పాట. ఇది  1986లో విడుదలైన సిరివెన్నెల చిత్రంలో సుప్రసిద్ధమైనది. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించింది కె.వి.మహదేవన్.

పల్లవి:

విధాత తలపున, ప్రభవించినది, అనాది జీవనవేదం, ఓం... 

ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం ...

కనుల కొలను లో ప్రతిబింబించిన విశ్వారూప విన్యాసం

యదకనుమలలో, ప్రతిధ్వనించిన విరించి పంచి గానం ...

సరసస్వర సుర ఛరీగమనమం,సామ వేద సారమిది ||2||
నే పాడిన జీవన గీతం, ఈ గీతం ..

విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం.... 


మీరు కొంత ప్రశాంతతని కొరుకున్నప్పుడల్లా ఈ పాటని వినవచ్చు. శ్రీ.కో.

Similar News