ఓ ఫ్రెండ్‌షిప్ డే మందు పార్టీలో,
సత్యవాడ పశ్చిమగోదావరి జిల్లాలో,
నిండెను పెను విషాధం ఎ కారణంలో,
మద్యమా, బోజనమా ఈ దారుణంలో. శ్రీ.కో
ఉండ్రాజవరం మండలం సత్యవాడకు చెందిన ముగ్గురు స్నేహితులు నిన్న రాత్రి మద్యం సేవించి పార్టీ చేసుకున్నారు. భోజనం తర్వాత ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్ల పరిస్థితి గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే.. కోనగంటి సుధీర్, అంబటి ప్రసాద్ అనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. శివ అనే మరో అబ్బాయి పరిస్థితి సీరియస్‌గా ఉంది. తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. వీళ్లంతా 16 ఏళ్ల కుర్రాళ్లే కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.