తీహార్ జైలు అంటే.. చాలామంది విని వుంటారు.. కానీ తీహార్ జైలు ఎక్కడ వుందో మీకు తెలుసా! ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊసలు లెక్కబెట్టారని ప్రసిద్ధి. తీహార్ (ఢిల్లీ) భారత రాజధాని ఢిల్లీ లో ఉన్న చాణక్యపురి నుంచి ఏడు కిలో మీటర్ల దూరంలోనే తీహార్ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్ జైలు అని అంటారు. తీహార్ జైలు, భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార ప్రాంగణము. ఈ జైలులో 6251 మంది సరిపోయే వసతులు ఉన్నా ఎప్పుడూ అంతకన్న మించే ఉంటున్నారట..కలి కాలం అంటే ఇదేనేమో. శ్రీ.కో.