విరిసెను కద ముందస్తు విల్లు,
కురిసెను కద ఎన్నో వరాల జల్లు,
వివిధ వర్గాలకు పుట్టెను ఆశలు ఫుల్లు,
ఎన్ని"కల"ల కోసం వంచుతారు తమ వల్లు.శ్రీ.కో
తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు, మురిపించారు.... ప్రజలతో పాటూ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు గృహ అవసరాలకు 50 యూనిట్ల ఉచిత విద్యుత్ పరిమితిని.. 101 యూనిట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. . తెలంగాణలో దేవాదాయ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుందని ప్రకటించారు. ఇలా మరి కొన్ని వరాలు ప్రకటించారు.