సర్దార్ పాపారాయుడు చిత్రం ఆ రోజుల్లో ఒక సూపర్ బంపర్ హిట్ సినిమా.. ఈ సినిమా కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్ని దాసరి నారాయణ రావు. ఎన్టీఆర్ ఈ సినిమాలో అద్బుత నటనని ప్రదర్శించాడు.. ఎన్.టి.రామారావు నటించిన సినిమాలలో ఇది ఒక ప్రఖ్యాతమైనది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980వ దశకం మొదట్లో నిర్మించిన ఈ చిత్రంలో రామారావు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం ధరించి ప్రేక్షకులను అలరించాడు. మిగిలిన నటులు...శారద, శ్రీదేవి, గుమ్మడి,సత్యనారాయణ, రావుగోపాలరావు, జ్యోతిలక్ష్మి, పండరీబాయి, అల్లు రామలింగయ్య, , అత్తిలి లక్ష్మి, త్యాగరాజు, కేవీ చలం, పీజే.శర్మ,చలపతిరావు, చిడతల అప్పారావు. ఈ చిత్రం అనేక కేంద్రాల్లో శతదినోత్సవాలు చేసుకోవడమే గాక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ద్విశతదినోత్సవం చేసుకోవడం,మరిన్ని రోజులు ప్రదర్శనకు నోచుకుని ఎన్నో రికార్డులు సాధించడాం ఆ రోజుల్లో గొప్ప విశేషం.