మడిసన్నాక కుసంత కలాపోస నుండాల!

Update: 2018-10-30 11:32 GMT

మీకు ఇష్టమైన విలన్ ఎవరు అని ఒకప్పటి తరాన్ని అడుగుతే.. వారు చెప్పే ముందు పేరు రావు గోపాలరావు...రావు గోపాలరావు పేరు వినగానీ...చాలామందికి అతని డైలాగులు గుర్తుకి వస్తాయి.. రావు గోపాలరావు గారు...తెలుగు సినిమా నటుడు మరియు మాజీ రాజ్యసభ సభ్యుడు. ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. ముఖ్యంగా..కొన్ని డైలోగులైన.....”సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోస నుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?”... ఇలాంటివి అభిమానులను ఉర్రుతలు ఉగించాయి.శ్రీ.కో.
 

Similar News