రాంగోపాల్ వర్మ.. అప్పట్లో తీసిన గొప్ప సినిమాల్లో... ఒక సినిమాగా.. క్షణక్షణం అని మనం చెప్పవచ్చు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. శ్రీదేవికి వీరాభిమాని అయిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమాను తను శ్రీదేవికి వ్రాసిన ప్రేమలేఖగా తన బ్లాగులో చెప్పుకున్నారట. ఈ సినిమాలో..మంచి కామెడీ తో పాటు ... చక్కని పాటలు కూడా వున్నాయి. మీరు చూడకుంటే.. తప్పక చూడాల్సిన సినిమా ఇది. శ్రీ.కో.