పూరి వేయబోతున్నడట మరో సినిమా దోశ

Update: 2018-09-10 06:19 GMT

పూరి వేయబోతున్నడట మరో  సినిమా దోశ,

దేవరకొండతో రుచించునని ఈ మసాలా ఆశ,

ఈనాటి ఇడియట్ కొడతాడట మాటల బాషా,

అంతా ఆ గోవిందుడి చేతిలోని తమాషా. శ్రీ.కో. 


పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలకు తర్వాత విజయ్ దేవరకొండ బ్లాకుభస్టర్ హీరోగా  ఎదిగిపోయాడు. ఇప్పుడు మన బంగారుకొండతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, దర్శకులు పోటీపడుతున్నారు. యూత్‌కు బాగా కిక్ ఇస్తున్న  విజయ్ దేవరకొండతో సినిమాలు చేస్తే బాగా సంపాదించవచ్చునని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.  అయితే విజయ్ చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు వున్నాయి. నోట, టాక్సీ వాల దూసుకు వస్తువుంటే... మరో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. రెండు సినిమాలు స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తిచేసుకునే పనిలో వున్నాయి.  వీటన్నిటి మద్య, సందు దోరికితే.. దేవరకొండతో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో పూరి ఎన్నో అల్లోచనలు నూరుతున్నాడని గుసగుసలు . విజయ్‌కి అవసర సమయంలో నేనున్నా అని ధైర్యం ఇచ్చిన వర్మ చొరవతో విజయ్‌ని ఒప్పించే పనిలో పూరి వున్నాడని టాలీవుడ్ టాక్.

Similar News