ప్రేమ పాటలు, ఆ తర్వాత విరహగీతాలు, బ్రేక్ అప్ పాటలు ఈ రోజుల్లో చాల ప్రత్యేకత కలిగి ఉంటున్నాయి. అలాంటి పాటే ఈ ప్రేమ పూసెనోయ్ వాడి పోయెనోయ్.....
ప్రేమ పూసెనోయ్ వాడి పోయెనోయ్
రెక్కలన్ని రాలిపోయెనోయ్ ||2|
పువ్వు చాటు ముల్లు లా మెల్లంగ గుచ్చినాది
నొప్పి కూడ చెప్పకోని తీరు బాధపెట్టెనోయ్
ఈ తేనె పరిమళం తీయంగ లేదురో
ఆ చేదు మాటవింటే ప్రాణమాగిపోయెరో||2|
రెక్కలెన్నొ తెచ్చి ఆకశాన్ని ఊపినానే
లెక్కలేని పూలచుక్కలెన్నొ తెంచినానె
ముళ్ళు గుచ్చుతున్న గుండె నొచ్చుతున్న
భాదింత అంత కాదె
అద్దం లో నన్ను నేను చూసుకుంటే
నా గుండె బుజ్జగించినట్టు వుందె
ఎంత చెప్పుకున్న ఓటమొప్పుకున్న
నా ఏడుపాగదాయె
చూసి చూసి నన్ను పావులా భలేగ
వాడుతున్న తీరు చూడరా
నా చుట్టు ఇందరున్న నవ్వింది నన్ను చూసి
ఈ వింతగున్న ఆటలేంటి ఓరి దేవుడా ||ప్రేమ||
ఇప్పటివరకు ఈ పాట వినకుంటే ఒక సారి వినండి, బహుశ మీకు బాగా నచ్చవచ్చు కూడా. శ్రీ.కో.