కొద్ది మంది రచయితలు నటులుగా కూడా మారి వారి ప్రత్యకతని చాటుకున్నారు, అలాంటి నటులే...పోసాని కృష్ణ మురళి గారు. ఐ లవ్ యు రాజా....అనే ఇతని డైలాగ్ చాల మందికి తెలిసిందే.... పోసాని కృష్ణ మురళి గారు ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే ఒక సినీరచయిత, నటుడు, దర్శకుడు మరియు నిర్మాత. ఇతను 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసారు మరియు వ్యాపారపరంగా విజయవంతమైన అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2009లో, చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసారు కాని ఓటమి పాలయ్యారు. వారు ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో నటిస్తూ చాల బిజీగా వున్నారు. శ్రీ.కో.