రాజకీయ చదరంగం మొదలాయే.

Update: 2018-09-08 10:55 GMT


తొలి విడత జాబితాలో లేదు చోటు,

మరి మలి విడత ఆశలకు పోటు,

కనీసం ఒక నామినేటెడ్ పోస్టూతో పాటు,

భవిషత్తుకు ఇస్తారట కొంత మాటు. శ్రీ.కో. 


తెరాస విడుదల చేసిన తొలి జాబితాలో తమ పేరు లేకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఆ నేతల రాజకీయ భవిష్యత్తుపై నాయకుడు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా తొలి విడత జాబితాలోచోటు దక్కని బాబు మోహన్, నల్లాల ఓదేలును శుక్రవారం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కు పిలిపించుకుని మాట్లాడాట. రాజకీయ భవిష్యత్తుపై అనుమానం అవసరం లేదని, తాను అండగా ఉంటానని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. ముందు ముందు ఎమ్మెల్సీ కానీ, ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి చూడాలి ఈ రాజకీయ పావులు ఎటు కడులుతాయో.

Similar News