పింఛను పై ఎందుకు పన్ను,
మీ ఖజానాకై వేస్తారా కన్ను,
ఇది జీవనభృతికి వెన్నుదన్ను,
వారు ఎప్పటికి నెంబర్ వన్ను. శ్రీ.కో
పెన్షన్ పై ఆదాయపన్ను ఎత్తివేయాలని కోరుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇప్పుడు ఉద్యమ బాట పడుతున్నారు. మేము సర్వీస్ లో ఉన్నప్పుడు చేసిన పనికి వేతనం ఇచ్చారు, అదే ఆదాయమే కనుక దానిపై ఆదాయ పన్ను వసూలు చేసిన అంటే అర్థం ఉంది, కానీ 30 నుంచి 36 ఏళ్లపాటు సేవలందించిన, పదవి విరమణ చేసిన తరువాత ఇచ్చే పింఛన్ను జీవనభృతి మాత్రమే అని వారు వాదిస్తున్నారు.