కొన్ని పాటలు మన గుండె లోతుల్లోకి వెళ్లి ...వేర్లు నాటుకుంటాయి, అలంటి ఒక పాట నే ఈ మద్య వచ్చిన అరవింద సమేత సినిమాలోని పాట...
ఈ పాటను కాలా భైరవుడు పాడారు, సాహిత్యం రామాజోగయ్య శాస్త్రి రాసినది మరియు సంగీత దర్శకుడు S. థమన్.
నిద్దరినీ ఇరిసేసి
రెప్పలనీ తెరిసాను
నువ్వొచ్చె దారుల్లో
సూపుల్నీ పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటి....
ఎన్నీ నాళ్ళైనాదో నినుజూసి .....కళ్ళారా....
ఎన్నెన్ని నాళ్ళైనాదో
నినుజూసీ ....కళ్ళారా...
చిమ్మటీ చీకటీ
కమ్మటీ సంగటి
ఎర్రగా కుంపటీ
ఎచ్చగా దుప్పటీ
కొమ్మల్లో సక్కటీ
కోయిలే ఒక్కటీ
కొమ్మల్లో సక్కటీ
కోయిలే ఒక్కటీ
గుండెనే గొంతుసేసి
పాడతాంది రార పెనిమిటీ...
గుండెనే ...గొంతుసేసి
పాడతాంది రార పెనిమిటీ…
పొలిమేర దాటీ పోయావనీ
పొలమారీ పోయే నీ దానినీ
కొడవలిలాంటి నిన్నే సంటివాడనీ
కొంగున దాసుకునే ఆలి మనసునీ
సూసీ సూడకా...సులకన సేయకూ
నా తలరాతలో కలతలు రాయకూ
తాళిబొట్టు తలుసుకుని
తరలి తరలి రార పెనిమిటీ...
తాళిబొట్టు తలుసుకుని
తరలి తరలి రార పెనిమిటీ…
నరఘోష తాకే కామందువే
నరఘోష తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికీ ఎండలలో కందిపోతివో
రకతపు సిందులతో తడిసిపోతివో
ఏళకు తింటివో ఎట్టనువ్వుంటివో
ఏటకత్తి తలగడై యాడపడుకుంటివో
నువు కన్న నలుసునైన
తలసి తలసి రార పెనిమిటీ…
నువు కన్న నలుసునైన
తలసి తలసి రార పెనిమిటీ...
నిద్దరినీ ఇరిసేసి
రెప్పలనీ తెరిసాను
నువ్వొచ్చె దారుల్లో
సూపుల్నీ పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటి....
ఎన్నీ నాళ్ళైనాదో నినుజూసి .....కళ్ళారా....
ఎన్నెన్ని నాళ్ళైనాదో
నినుజూసీ ....కళ్ళారా...!!
భర్త రాక కోసం ఎదురు చూసే భార్య భావాన్ని, ఎంత బాగా చెప్పారో కదా. శ్రీ.కో.