వెండితెర గ్యాంగ్ లీడర్ చేసెను,
తమ్ముడితో ఒక గ్రీన్ ఛాలెంజ్,
మొక్కలంటే నాకు తొలిప్రేమ అని,
నాటేను మన గబ్బర్ సింగ్ నేడే. శ్రీ.కో
అగ్ర కథానాయకుడు చిరంజీవి విసిరిన హరిత సవాలు (గ్రీన్ ఛాలెంజ్) సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్వీకరించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని జనసేన కార్యాలయంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తమ స్నేహితులను నామినేట్ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు.