బిబిసి 100 ఉత్తమ విదేశీ భాషా చిత్రాల జాబితాలోస్థానం సంపాదించుకున్నఏకైక భారతీయ చిత్రం ఏదో మీకు తెలుసా? ఆ సినిమా సత్యజిత్ రే తీసిన పథేర్ పాంచాలీ సినిమా. మన సత్యజిత్ రే (మే 2 1921–ఏప్రిల్ 23 1992) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు. రే సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. మీరు ఇపాతివరకు రే సినిమాలు చూడకుంటే.. తప్పక చుడండి. శ్రీ.కో.