పాకిస్తాన్ పాడు దృష్టి మారిందా

Update: 2018-08-14 09:24 GMT

పాకిస్తాన్లో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ముందడుగు,

భారత్‌తో సత్సంబంధాలు నెలకొనే విధంగా ఆ అడుగు,

జైళ్లలోని 26 మంది మత్స్యకారులను విడుదల జరుగు,

పొరుగుదేశంతో స్నేహభావంతో మెలగాలనా ఈ పరుగు, 

లేదా గతంలో లాగానే కుట్రతో నాటకమా ఓ బౌలర్ గారు. శ్రీ.కో. 

పాకిస్తాన్లో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో భారత్‌తో సత్సంబంధాలు నెలకొనే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టునది. అందులో భాగంగా అక్కడి జైళ్లలోని 26 మంది మత్స్యకారులను విడుదలచేయాలని నిర్ణయించుకున్నది. కొత్త పార్లమెంటు ఏర్పడగానే సత్ప్రవర్తన కలిగిన 26 మంది మత్స్యకారులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్‌ నదీజలాలలోకి చేపలుపట్టడానికి వెళ్లిన మత్స్యకారులను కాంట్‌ రైల్వే స్టేషన్‌ నుండి కరాచిలోని మాలిర్‌ జైలుకు అదేవిధంగా లాహోర్‌కు తరలించారని అంతర్జాతీయ నివేదిక తెలిపింది. భారత సరిహద్దు వాఘావద్ద వారిని అధికారులకు అప్పగిస్తారు. విడుదలైన భారత మత్స్యకారులను ప్రయాణ ఖర్చులను ఈదీ ఫౌండేషన్‌ భరిస్తుందని ఫౌండేషన్‌ అధికారి సాది ఈది తెలిపారు. పాకిస్తాన్‌, భారత్‌ మత్స్యకారులపై నిబంధనలను సడలించాయని ఇది అన్నారు. రెండు దేశాలకు సంబంధించి జాలర్లు పేదవారు కావడం వలన వారి మీద చర్యలు తీసుకోవద్దని నిర్ణయించాయన్నారు. పాకిస్తాన్‌ కొత్తగా ఎన్నికైన మెజారిటీ ప్రభుత్వం రేపు మొదటి పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మంచి నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పొరుగుదేశంతో స్నేహభావంతో మెలగాలనుకుంటున్నది.
 

Similar News