కొద్ది మంది అంటారు సముద్రం లోతు... ఆడవారి మనస్సు తెలుసు కోవడం అంత సులువు కాదని, అయితే మీకు అన్ని సముద్రాలలో...ఏది లోతైన సముద్రమో మీకు తెలుసా! అన్ని సముద్రాలలో అతి ఎక్కువ లోతైన సముద్రము పసిఫిక్ మహాసముద్రం. ఇలా భూమిపై గల మహాసముద్రాలన్నిటిలోకీ పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) అతి పెద్దది. లాటిన్ భాషలో ఈ మహాసముద్రానికి "మేర్ పసిఫికమ్" Mare Pacificum అన్న పేరు ఆపాదించినవాడు పోర్చుగీసు నావికుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్. ఈ మాటకు "ప్రశాంతమైన సముద్రం" అని అర్థమట. శ్రీ.కో.