ఓ బంగరు రంగుల చిలకా పలకవే!

Update: 2018-11-23 07:24 GMT

కొన్ని పాటలు..ఒక రొమాంటిక్ మూడ్ లోకి మనని చాల త్వరగా తీసుకువెల్లలుగుతాయి. అలాంటి పాటే తోటరాముడు సినిమాలోని.. ఈ.....

ఓ బంగరు రంగుల చిలకా పలకవే

ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ

నా పైన అలకే లేదనీ

ఓ అల్లరి చూపుల రాజా పలకవా

ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ 

నా మీద ప్రేమే ఉందనీ

నా పైన అలకే లేదనీ
పంజరాన్ని దాటుకునీ

బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో

మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా

నిరుపేదను వలచావెందుకే

నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది

పువ్వులోని నవ్వే నాదిలే

కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది

అందించే భాగ్యం నాదిలే

ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే
ఓ అల్లరి చూపుల రాజా పలకవా

ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ

నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
ఒక్క సారి ఎప్పుడు మీరు వినండి...ఎంత మాదుర్యంగా వుందో మీకు తెలుస్తుంది. శ్రీ.కో.

Similar News