రాజ"కీ"య నమోదా?

Update: 2018-08-02 09:51 GMT

జాతీయ పౌర రిజిస్ట్రేషన్లో
ఒకవేళ పేరు కోత పడినా,
ఓటర్ల జాబితాలో పేర్లు ఉండినా,
ఓట్లు వేయడానికి అర్హులేనోయ్. శ్రీ.కో

అసోంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియ రాజకీయ వివాదాలకు తెరతీసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన ఎన్‌ఆర్‌సీ తుది ముసాయిదాలో 40లక్షల మందికి చోటు దక్కకపోవడంపై పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శలు వ్యక్తం చేశారు. రిజస్టర్‌లో పేరు లేని వారికి ఓటు హక్కు లేకుండా చేయాలనే రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ముసాయిదాలో లేని వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటే వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి ఓపీ రావత్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Similar News